Next >>

"అతి త్వరలో నేను మీకు "css ట్యుటోరియల్" వలెనే "తెలుగులో JavaScript ట్యుటోరియల్" ని కూడా "తెలుగులో" వివరించే content ని host చేయబోతున్నాను మరియు దీనితో పాటు "తెలుగులో JavaScript app" ని కూడా publish చేసే ప్రయత్నంలో ఉన్నాను అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. క్రింది వీడియోలను వీక్షించి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని feedback form ద్వారా తెలుపుతారని ఆశిస్తున్నాను."

JavaScript - పరిచయం

JavaScript అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వెబ్ అప్లికేషన్ లను డెవలప్ చెయ్యటానికి వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లలో ఇది కూడా ఒకటి మరియు చాలా ముఖ్యమైంది. ఇది ఎలా పని చేస్తుంది అని చెప్పటానికి ఒక చిన్న ఉదాహరణ :- మీరు ఏదైనా ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలను Online లో చెక్ చేసుకోడానికి వెళ్ళినపుడు Online లో మీ Hall ticket నెంబర్ ను enter చేస్తారు. ఒకవేళ Hall ticket నెంబర్ కు బదులుగా ఏదైనా "wrong డేటా" ని input అనగా టైపు చేసే పయత్నం చేస్తే గనుక అది ఒక " error message " ను చూపిస్తుంది. ఇలా చూపించటానికి వెబ్ పేజ్ లో వ్రాసే code ని JavaScript లో వ్రాస్తారు, ఈ error message ని JavaScript లో "alert message" అంటారు. అంతెందుకు ఇప్పడు మీరు చదువుతున్న ఈ "content" ని "copy" చెయ్యకూడదని నేను "పరిమితి (restriction)" పెట్టాను. ఇలా చెయ్యటానికి నేను Javascript లోనే code ని వ్రాసాను. ఇలాంటివే కాకుండా మీరు ఉహించలేనివి మరెన్నో ఈ Javascript ద్వారా చేయవచ్ఛును. ఇటువంటి ఎన్నో విషయాలను JavaScript ను వాడి ఎలా వ్రాయవచ్ఛునో మున్ముందు మనం తెలుసుకుందాము.

* JavaScript మరియు Java అనేవి పూర్తిగా రెండు వేర్వేరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లు.

JavaScript కోడ్ ని <script>, </script> అనే జత ట్యాగ్ ల నడుమ వ్రాస్తారు. వెబ్ పేజ్ లో గల head లేదా body సెక్షన్ లలో ఎక్కడైనా వ్రాయవచ్చును. అనగా రెండింటిలోనూ వ్రావచ్ఛును అని అర్థం.

HTML పేజ్ లో JavaScript
JavaScript code area

గమనిక : మొదట type = " text/javascript " అని వ్రాస్తేగాని కోడ్ run (execute) అయ్యేది కాదు. కానీ రాను రాను లేటెస్ట్ బ్రౌజర్ లలో దీన్ని వ్రాయక పోయిననూ కోడ్ execute అయ్యేవిధంగా బ్రౌజర్ లను తయారు చేశారు. అందువల్ల మీరు కోడ్ వ్రాసేటప్పుడు type = " text/javascript " అని వ్రాసినా వ్రాయక పోయినా పరవాలేదు కోడ్ మాత్రం execute అవుతుంది. ఇదే విషయాన్ని పై పటము ద్వారా అర్థం చేసుకోవచ్చును.

JavaScript - Syntax (వాక్యనిర్మాణం)

ప్రతీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి వాక్యనిర్మాణం (syntax) అనేది ఒకటి ఉంటుంది. దీన్ని తప్పక పాటించాలి మరియు దీన్ని నేర్చుకోవడం చాలా సులభం కూడా. JavaScript లో వ్రాసే ప్రతీ లైన్ ఒక semicolon " ; " తో ముగుస్తుంది మరోలా చెప్పాలంటే "semicolon" తో ముగియబడే ప్రతీ లైన్ ను JavaScript లో ఒక statement అంటారు. అనగా కంప్యూటర్ JavaScript code ని read (తనదైన శైలిలో అర్థం చేసుకోవటం) చేసేటప్పుడు ఒక statement ఎక్కడి నుండి మొదలుకొని ఎక్కడికి (end) అంతమవుతుందో తెలుసుకోటానికి మనం లైన్ చివర " ; " (semicolon) ని వ్రాస్తున్నాము అని అర్థం చేసుకోండి.

JavaScript - Variable (చరరాశి)

variable (చరరాశి) అనగా ఏదైనా విలువను తనలో store (నిలుపుకోవటం, పట్టుకోవటం...) చేసుకునే స్వభావం గలది అని అర్థం. మనం స్కూల్లో "x = 1", "y = 2" అనుకొనుము లాంటివి చదువుకొనే ఉన్నాము. వీటిలో x , y లను చరరాశులు (variables) అంటారు మరియు 1, 2 లను "స్థిరాంకాలు (constants)" అంటారు. JavaScript లో కూడా variables అనేవి ఇలానే పనిచేస్తాయి మరియు దేన్నయినా(సంఖ్యలు, కొన్ని చిహ్నాలు కాకుండా) JavaScript లో ఒక variable గా నిర్వచించాలి అంటే దానికి ముందు "var" అని వ్రాస్తే సరిపోతుంది. అది ఎలానో క్రింద చూద్దాం.

var x = 1 ;

var y = 2 ;

var ctr = 3 ;

var 3 = 5 ; ("నెంబర్" ని variable గా నిర్వచించరాదు)

var $# = 29 ; ("Symbols" ని variable గా నిర్వచించరాదు)

var xy = 13 ;            var abc = 10 ;

ఇలా ఎన్నైనా వ్రాయవచ్చును.

గమనిక : పై పటములోని చివరి రెండు statement లను ఒకే line లో వ్రాయడం జరిగింది. ఇలా కూడా వ్రాయవచ్చును. కోడ్ కూడా error లేకుండా run అవుతుంది. కానీ పద్దతి అనేది ఒకటి ఉంది కనుక దాన్ని పాటిస్తే మంచిది. ( రెండు టికెట్లు కొనుక్కొని ఒకే seat లో కూర్చున్నట్లుంటుంది. - అందువల్ల రూల్ పాటిద్దాం)

JavaScript - Literals

JavaScript ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో literal అనగా ఒక నిర్దిష్టమైన విలువ.

JavaScript - Comments

సాధారణంగా Programmer లు code వ్రాసేటప్పుడు ఏ "Statement" ఎందుకు వ్రాసారో గుర్తుపెట్టుకోటానికి లేదా ఇతరులు కోడ్ చదివేటప్పుడు సులభంగా అర్థంచేసుకోడానికి "Statement" ప్రక్కన "Comments" లను వ్రాస్తారు. ఈ విధంగా Comment లను వ్రాయడం వల్ల code కి కూడా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. JavaScript లో Comment లను రెండు విధాలుగా వ్రాస్తారు. Comment ని ఒకే లైన్ లో వ్రాస్తే దాన్ని "single line comment"అంటారు. వీటిని " // " దీనితో మొదలు పెడతారు. Comment ని ఒకటికంటే ఎక్కువ లైన్ లలో వ్రాస్తే దాన్ని "multi - line comment" అంటారు. దీన్ని " /* " తో మొదలుపెట్టి చివర్లో " */ " తో ముగిస్తారు.


తదుపరి JS Output ...


Back to Top